BCCI president Sourav Ganguly on IPL 2021 bubble breach: 'Travelling could have been an issue'
#Ipl2021
#Ganguly
#Bcci
#Indianpremierleague
భారత్- ఇంగ్లండ్ సిరీస్‌లను ఎలాంటి ఆటంకాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించడంతోనే ఐపీఎల్ 2021 కూడా ఇక్కడ నిర్వహించాలనుకున్నామని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. ఈ సీజన్ క్యాష్ రిచ్ లీగ్ కోసం తొలుత యూఏఈ చర్చకు వచ్చినప్పటికీ దేశంలో కరోనా ప్రభావం అంతగా లేకపోవడంతో ఆ ప్రతిపాదనను పక్కన పెట్టినట్లు తెలిపాడు. ఐపీఎల్ 2021 సీజన్‌ను కరోనా వైరస్ కమ్మేయడంతో లీగ్‌ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే లీగ్ నిర్వహణ విషయంలో బీసీసీఐ అట్టర్ ఫ్టాప్ అయిందని, యూఏఈ వేదికగా నిర్వహించి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దాదా తమ నిర్ణయం సరైందేనని సమర్థించుకున్నాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాదా పలు ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చాడు.